Abn logo
Jul 6 2020 @ 00:41AM

సమ్మెతో కోల్‌ ఇండియా ఉత్పత్తికి గండి

న్యూ ఢిల్లీ : కార్మికుల మూడు రోజుల సమ్మెతో కోల్‌ ఇండియా బొగ్గు ఉత్పత్తికి భారీగా గండి పడింది. గురువారం నుంచి శనివారం వరకు జరిగిన ఈ సమ్మెలో కంపెనీ రోజువారీ సగటు  ఉత్పత్తి 5.73 లక్షల టన్నులకు పడిపోయింది. అంతకు ముందు పది రోజుల సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే ఇది 56 శాతం తక్కువ. వాణిజ్య స్థాయి లో  బొగ్గు ఉత్పత్తికి ప్రైవేటు సంస్థలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌ ఇండియా కార్మికులు గత గురువారం నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. 


Advertisement
Advertisement
Advertisement