కోచింగ్‌ సెంటర్‌ మోసం

ABN , First Publish Date - 2022-08-07T06:50:51+05:30 IST

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష పాస్‌ చేయిస్తామంటూ సబ్జెక్టుకు రూ.1500 నుంచి రూ. 2 వేల వరకు వసూ లు చేసి మోసం చేసిన కోచింగ్‌ సెంటర్‌ ఉదంతం వెలుగు చూసింది.

కోచింగ్‌ సెంటర్‌ మోసం

 పరీక్ష పాస్‌ చేయిస్తామని డబ్బు  వసూలు

సబ్జెక్టుకు రూ.1500 నుంచి రూ.2 వేలు

ఎస్‌ఎ్‌ఫఐ ఆందోళనతో వెలుగులోకి

30 మంది విద్యార్థుల ఫిర్యాదు

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 6 : ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష పాస్‌ చేయిస్తామంటూ  సబ్జెక్టుకు రూ.1500 నుంచి రూ. 2 వేల వరకు వసూ లు చేసి మోసం చేసిన కోచింగ్‌ సెంటర్‌ ఉదంతం వెలుగు చూసింది. తీరా పరీక్ష పాస్‌కాక పోవ డంతో బాధిత విద్యార్థులు ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు కీర్తి ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీసు స్టేషన్‌ వద్ద శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ చేయిస్తామంటూ సబ్జెక్టుకు రూ.1500 నుంచి రూ.2వేల చొప్పున ఎం.ఎ్‌స.నాయుడు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకురాలు సుగుణ వసూలు చేసినట్లు 30 మంది విద్యార్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుగుణను అరెస్టు చేయాలంటూ ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు నినాదాలు చేశారు. వాస్తవాలను విచారించి చర్యలు చేపడతామని చిలకలపూడి ఎస్సై నాగకల్యాణి  చెప్పారు. చదవకుండా పాసవుదామనుకోవడం అవివేకమని సీఐ శ్రీధర్‌కుమార్‌ హితవు పలికారు.

Updated Date - 2022-08-07T06:50:51+05:30 IST