Advertisement
Advertisement
Abn logo
Advertisement

బైక్‌పై వెళ్తుండగా కాల్పులు జరిపిన దుండగులు.. ఆ హత్య ఎవరు చేయించారో తెలిసి షాకైన పోలీసులు..!

అతను ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు.. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.. పది నెలల క్రితం భార్యతో అతడికి విభేదాలు తలెత్తాయి.. దీంతో ఆమె కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. ఆదివారం సాయంత్రం అతను ఇంటి నుంచి కోచింగ్ సెంటర్‌కు బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. భార్యే ఆ హత్య చేయించిందని తేలింది.. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


సోనిపట్‌కు చెందిన పంజాబ్ సింగ్ నగరంలో ఓ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం అవ్‌నీత్ కౌర్‌తో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ సింగ్, అవ్‌నీత్ మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో అవ్‌నీత్ తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ మరో యువకుడితో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. అయితే విడాకులు ఇచ్చేందుకు పంజాబ్ సింగ్ నిరాకరించాడు. 


తను రెండో పెళ్లి చేసుకోవడానికి భర్త అడ్డుగా ఉన్నాడు కాబట్టి.. అతడిని అంతమొందించాలని అవ్‌నీత్ ప్లాన్ వేసింది. అవ్‌నీత్ కుటుంబ సభ్యులు తమ బంధువులలో ఇద్దరు వ్యక్తులతో ఆ పని పూర్తి చేయించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ఆ ఇద్దరూ పోలీసులకు దొరకడంతో అసలు విషయం బయటపడింది. అవ్‌నీత్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement