శిక్షణలో బాలికను అసభ్యంగా తాకిన క్రికెట్ కోచ్

ABN , First Publish Date - 2021-10-22T02:42:45+05:30 IST

తన వద్దకు శిక్షణకు వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్ సహా

శిక్షణలో బాలికను అసభ్యంగా తాకిన క్రికెట్ కోచ్

పుదుచ్చేరి: శిక్షణకు వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్ సహా ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పుదుచ్చేరిలో జరిగిందీ ఘటన. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు బాలిక భుజాలు, చెస్ట్, ఇతర భాగాలను అసభ్యంగా తాకినట్టు ఆరోపణలు ఉన్నాయి. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోయేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 


సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన తమరైకన్నన్ బాలికను అసభ్యంగా తాకుతూ వేధించినట్టు మెట్టుపాళయం పోలీసులకు చైల్ట్ లైన్ ద్వారా ఫిర్యాదు అందింది. తనను ప్రేమిస్తున్నట్టు తమరైకన్నన్ మెసేజ్‌ చేశాడని, తిరస్కరిస్తే శిక్షణ ఇవ్వనని బెదిరించాడని బాధిత బాలిక ఆరోపించింది. అంతకుముందు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయబోతోందన్న విషయం తెలిసిన తమరైకన్నన్.. భార్యతో కలిసి బాలిక  ఇంటికి వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కోరాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని బాలిక చైల్డ్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమరైకన్నన్ సహా ఐదుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-22T02:42:45+05:30 IST