బర్మింగ్‌హామ్ : రీషెడ్యూల్ అయిన ఎడ్జ్‌బాస్టన్(Edgebaston) టెస్ట్‌లో ఓటమిపై టీమిండియా(Team India) కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul dravid) స్పందించాడు. మొదటి 3 రోజులు భారత్(India) ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్(Batting) వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ద్రావిడ్ పేర్కొన్నాడు. బౌలింగ్(Bowling) విషయంలోనూ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారని అన్నాడు. ఇంగ్లండ్(Englant) జట్టు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసించాడు. జో రూట్(Joe Root), బెయిర్‌స్టో(Bairstrow) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారని, పార్టనర్‌షిప్‌ని విడదీసేందుకు 2-3 అవకాశాలు లభించినా ఒడిసిపట్టుకోలేకపోయామని అన్నాడు. అయినా ప్రత్యర్థి జట్టు ఆటను మెచ్చుకోకుండా ఉండలేమని మీడియా సమావేశంలో చెప్పాడు.
పటిష్ట స్థితి నుంచి ఓటమిని చవిచూడడం తమకు నిరుత్సాహం కలిగించిందని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా(South Africa) సిరీస్‌లో కూడా రెండు అవకాశాలు వచ్చని అందుకోలేకపోయాం. కాబట్టి అవకాశాలను ఒడిసిపట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సివుందని చెప్పాడు. టెస్టు మ్యాచుల్లో 20 వికెట్లు తీసే విషయంలో గత రెండేళ్లుగా ఇండియా అద్భుతంగా రాణిస్తోందని ప్రస్తావించాడు. అయితే కొన్ని నెలలుగా మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను ఇవ్వలేకపోయామన్నాడు. టెస్ట్ మ్యాచ్ ఆరంభం నుంచి ఫిట్‌నెస్ లేదా ప్రదర్శనపై దృష్టి సారించాల్సి ఉంటుందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి