కోచ్‌ పదవికి ద్రవిడ్‌ దరఖాస్తు

ABN , First Publish Date - 2021-10-27T07:33:41+05:30 IST

టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది......

కోచ్‌ పదవికి ద్రవిడ్‌ దరఖాస్తు

 ఎన్‌సీఏకు లక్ష్మణ్‌?

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. దీంతో అతడి ఎంపిక ఇక లాంఛనమే కానుంది. దరఖాస్తులకు మంగళవారం చివరిరోజు కావడంతో ద్రవిడ్‌ ఈ ప్రక్రియను ముగించాడు. ప్రస్తుతం ఈ మాజీ కెప్టెన్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా కొనసాగుతున్నాడు. అలాగే ఎన్‌సీఏలోని అతడి టీమ్‌ పారస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), అభయ్‌ శర్మ (బ్యాటింగ్‌ కోచ్‌) ఇంతకుముందే అప్లై చేశారు. చీఫ్‌కోచ్‌గా ద్రవిడ్‌ నియామకం ఇదివరకే ఖరారైందని, ఇది కేవలం లాంఛనమేనని బోర్డు సీనియర్‌ అధికారి తెలిపాడు. ఇక ఎన్‌సీఏ నుంచి ద్రవిడ్‌ వైదొలిగితే ఆ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించాలనుకుంటున్నారు. అయితే ఇదివరకే అతడీ ఆఫర్‌ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవి స్వీకరిస్తే లక్ష్మణ్‌ సన్‌రైజర్స్‌ మెంటార్‌, కామెంట్రీ, కాలమ్స్‌కు దూరం కావాల్సి ఉంటుంది. ఎన్‌సీఏకు ఏడాదిలో 200 రోజులు సమయం కేటాయించాలి. దీంతో  హైదరాబాద్‌ నుంచి అతడి కుటుంబం బెంగళూరుకు మకాం మార్చాల్సి ఉంటుంది. అందుకే ఎన్‌సీఏపై లక్ష్మణ్‌ అంత సుముఖంగా కనిపించడం లేదు. అయినా బీసీసీఐ మాత్రం అతడివైపే మొగ్గు చూపుతోంది. మరి.. లక్ష్మణ్‌ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తాడో లేదో చూడాలి. 

Updated Date - 2021-10-27T07:33:41+05:30 IST