Ravi Shastri Returns: ఒకే సిరీస్‌లో గతేడాది కోచ్‌గా.. ఇప్పుడు కామెంటేటర్‌గా!

ABN , First Publish Date - 2022-07-02T01:30:00+05:30 IST

గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి (Ravi Shastri) ఈసారి అదే

Ravi Shastri Returns: ఒకే సిరీస్‌లో గతేడాది కోచ్‌గా.. ఇప్పుడు కామెంటేటర్‌గా!

బర్మింగ్‌హామ్: గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి (Ravi Shastri) ఈసారి అదే సిరీస్‌లో కామెంటేటర్‌గా దర్శనమిచ్చాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గతేడాది నాలుగు మ్యాచ్‌లే జరగ్గా ఒక టెస్టును రీషెడ్యూల్ చేశారు. అదిప్పుడు జరుగుతోంది. ఇదే సిరీస్‌కు అప్పట్లో కోచ్‌గా వెళ్లి డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చిన రవి.. చివరి మ్యాచ్‌లో మాత్రం మైక్ పట్టుకోవడంతో అభిమానులు మునుపటి రవిని చూస్తున్నారు.


భారత జట్టుతో కోచ్‌గా కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి ఐపీఎల్‌ (IPL)లో కామెంట్రీ చెప్పాడు. అప్పుడు హిందీ బ్రాడ్‌కాస్ట్ టీమ్‌లో ఉండగా, ఇప్పుడు  ఇంగ్లిష్ కామెంటరీలోకి మళ్లీ వచ్చేశాడు. యూకే (UK) చేరుకున్న ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వాసిం అక్రమ్‌ (Wasim Akram)తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. 


గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు రవి అండగా అద్భుతం చేసింది. నాటింగ్‌హామ్ టెస్టులో దారుణంగా ఓడిపోయిన టీమిండియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 2-1 ఆధిక్యం సంపాదించింది. సెప్టెంబరులో మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టెస్ట్ భారత శిబిరంలో కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా బారినపడిన రవిశాస్త్రి ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అయినప్పటికీ వ్యూహాత్మకంగా ఆడిన కోహ్లీసేన అద్భుత విజయాన్ని అందుకుని ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది.  

Updated Date - 2022-07-02T01:30:00+05:30 IST