వాహనదారులకు మరో షాక్

ABN , First Publish Date - 2021-11-16T02:28:23+05:30 IST

దేశంలో పెట్రో ధరలు తారాజువ్వల్లా నింగికి ఎగసి సామాన్యులకు మోయలేని భారంగా

వాహనదారులకు మరో షాక్

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు తారాజువ్వల్లా నింగికి ఎగసి సామాన్యులకు మోయలేని భారంగా మారిన వేళ వారిపై మరో బాంబు పడింది. పెట్రోలుతో పోలిస్తే కాస్తో కూస్తో చవకగా లభించే సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలోకు  2.28 రూపాయలు పెరగ్గా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో 2.56 రూపాయలు పెరిగింది. 


నిజానికి గత 45 రోజుల్లో సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో రాజధాని వాహనదారుల జేబులకు మరోమారు చిల్లుపడింది. సీఎన్‌జీ ధరలు పెంపు విషయాన్ని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


తాజా పెంపుతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలో గ్యాస్ రూ. 52.04కు పెరగ్గా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ. 58.58కి ఎగబాకింది. ఇప్పటి వరకు ఢిల్లీలో ఈ ధర రూ. 49.76గా ఉండగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో రూ. 56.02గా ఉండేది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెరిగిన సీఎన్‌జీ ధరలు మరింత భారం మోపాయి. 

Updated Date - 2021-11-16T02:28:23+05:30 IST