చమురు సంస్థలకు చెల్లించే రేటు డబుల్
రిటైల్ ధరలు 10-15% పెరిగే అవకాశం
ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళన
విద్యుత్, ఎరువుల కంపెనీలపై పెనుభారం
న్యూఢిల్లీ, మార్చి 31: కేంద్ర ప్రభుత్వం సహజ వాయువు(సీఎన్జీ) ధరలను భారీగా పెంచింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే సీఎన్జీకి ప్రస్తుతం మెట్రిక్ మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు 2.9 డాలర్లు చెల్లిస్తున్నారు. దీన్ని ఏకంగా 6.10 డాలర్లకు పెంచారు. అంటే, రెట్టింపు కన్నా ఎక్కువ. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో సహజవాయువు ఉత్పత్తిచేసే రిలయన్స్ సంస్థకు ఇప్పటిదాకా చెల్లిస్తున్న 6.13 డాలర్లను 9.92 డాలర్లకు పెంచారు. భారతదేశ చరిత్రలోనే సహజ వాయువుకు ఇప్పటిదాకా పలికిన అత్యధిక ధర ఇదే. చమురు కంపెనీలకు చెల్లించే సీఎన్జీ చార్జీలను ప్రభుత్వం ఏటా రెండుసార్లు (ఏప్రిల్ 1న, అక్టోబరు 1న) సవరిస్తుంది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సీఎన్జీ ధరలు భారీగా పెరగడంతో భారతదేశంలోనూ ధరలు పెంచక తప్పలేదు. సహజ వాయువు ధరలు పెరగడంతో దాని ప్రభావం అనేక పరిశ్రమలపై పడనుంది. ముఖ్యంగా విద్యుత్, ఎరువుల కర్మాగారాలు భారీఎత్తున సహజవాయువును వినియోగిస్తున్నాయి. పెరిగిన సహజ వాయువు ధరలతో ఈ రెండింటి ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరగనున్నా యి. ప్రజల మీద ఆ భారం వేయకపోతే విద్యుత్, ఎరువుల కర్మాగారాలు నష్టాలపాలు కావడం ఖా యం. కేంద్రం తాజా నిర్ణయంతో సహజవాయువు రిటైల్ ధరలు 10 నుంచి 15ు పెరుగుతాయని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వా హనాల ఇంధనంగా,
పైప్‌లైన్ ద్వారా అందించే వంటగ్యా్సగా సీఎన్జీని వాడుతున్నారు. వీరందరికీ భారీ వడ్డన తప్పదు. వీటన్నింటి ధరలు పెరగడం ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. సీఎన్జీ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్ర భుత్వం 3ు వ్యాట్ తగ్గించింది. దాంతో సీఎన్జీ కిలోకు రూ.6, పైప్‌లైన్ వంటగ్యాస్ కిలోకు రూ.3.5 మేరకు తగ్గనున్నాయి. మరోపక్క పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల్లో 9 సార్లు పెరిగాయి. శుక్రవా రం కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.