Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం : ఎమ్మెల్యే

తాండూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు : సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.5లక్షల40వేల విలువైన చెక్కులను అందజేశారు. కొత్లాపూర్‌కు చెందిన లలితాబాయికి రూ.లక్షా90వేలు, కోకట్‌ గ్రామానికి చెందిన ఒకరికి రూ.1లక్ష50వేలు, పట్టణానికి చెందిన బస్వరాజ్‌కు రూ.1లక్ష, మల్లికార్జున్‌కు రూ.1లక్ష విలువైన చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ సాయం పొందాలనుకునేవారు క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement
Advertisement