సాగునీటి రంగానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-01-25T05:40:59+05:30 IST

సాగునీటి రంగానికి పెద్దపీట

సాగునీటి రంగానికి పెద్దపీట
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు: సాగు, తాగునీటి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం నగరంలోని తన నివాసంలో ఆయా మండలాల నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్‌ఐ డీ-82 కాల్వ అసంపూర్తి పనులు వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సీజన్‌ నాటికి వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల పరిధిలో 38 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. తక్షణమే డిండి, పాలమూరు ప్రాజెక్ట్‌లకు రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశించినట్లు నారాయణరెడ్డి వివరించారు. కార్యక్రమంలో కమ్లీమోత్యనాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, తాళ్ల రవీందర్‌, రాములు, సురేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:40:59+05:30 IST