Cmdaలో తొలి మహిళా డ్రైవర్‌

ABN , First Publish Date - 2022-07-13T13:06:43+05:30 IST

చెన్నై నగర అభివృద్ధి సంస్థ (సీఎండీఏ)లో తొలిసారిగా మహిళా డ్రైవర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర రవాణా శాఖతో పాటు పలు శాఖల్లో మహి ళా డ్రైవర్లు

Cmdaలో తొలి మహిళా డ్రైవర్‌

పెరంబూర్‌(చెన్నై), జూలై 12: చెన్నై నగర అభివృద్ధి సంస్థ (సీఎండీఏ)లో తొలిసారిగా మహిళా డ్రైవర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర రవాణా శాఖతో పాటు పలు శాఖల్లో మహిళా డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీఎండీఏలో తొలి మహిళా డ్రైవర్‌గా కొడుంగైయూర్‌కు చెందిన ఇందుప్రియ (34) నియమితులయ్యారు. గుమ్మిడిపూండిలోని రవాణా సంస్థ శిక్షణా కార్యాలయంలో శిక్షణ పొందిన ఇందుప్రియకు సీఎండీఏలో డ్రైవర్‌గా గృహ వసతి, నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌.ముత్తుస్వామి మంగళవారం నియామక పత్రాలు అందజేశారు.

Updated Date - 2022-07-13T13:06:43+05:30 IST