సిమెంటు కర్మాగారాన్ని సందర్శించనున్న సీఎండీ

ABN , First Publish Date - 2021-10-20T04:32:50+05:30 IST

సిమెంటు కర్మాగారాన్ని సందర్శించనున్న సీఎండీ

సిమెంటు కర్మాగారాన్ని సందర్శించనున్న సీఎండీ

తాండూరు రూరల్‌: ఈనెల 12వ తేదీన ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ సిమెంటు కర్మాగారాల సీఎండీ సంజయ్‌ బంగా తాండూరు మండలం కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారాన్ని సందర్శించనున్నారు. రెండురోజుల్లో హైదరాబాద్‌లో సీసీఐ మార్కెటింగ్‌ అధికారులతో సిమెంటు విక్రయాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారాన్ని సందర్శించనున్నట్లు సీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారంలో రోజుకు 3వేల టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతూ కర్మాగారం లాభాలబాటలోకి  చేరుకుంది. గత కొన్నినెలలుగా సీసీఐ కర్మాగారాలకు సీఎండీ లేకపోవడంతో ఇటీవల కేంద్ర పరిశ్రమల శాఖ సంజయ్‌బంగాను నియమించింది. ఈ మేరకు ఆయన సిమెంటు ఉత్పత్తులు, మార్కెటింగ్‌, ఉద్యోగస్తులతో సమీక్షించనున్నట్లు సమాచారం.  

Updated Date - 2021-10-20T04:32:50+05:30 IST