ఓవర్‌ డ్రాఫ్ట్‌ తెచ్చి షిప్‌యార్డును నడుపుతున్నాం

ABN , First Publish Date - 2020-08-03T09:46:01+05:30 IST

హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని, బ్యాంకు నుంచి ఓవర్‌ డ్రాఫ్డ్‌ ..

ఓవర్‌ డ్రాఫ్ట్‌ తెచ్చి షిప్‌యార్డును నడుపుతున్నాం

సీఎండీ శరత్‌బాబు


విశాఖపట్నం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని, బ్యాంకు నుంచి ఓవర్‌ డ్రాఫ్డ్‌ తీసుకువచ్చి సంస్థను నడుపుతున్నామని సీఎండీ శరత్‌బాబు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సంస్థలో ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇది మొదటిదని వివరించారు.


చనిపోయిన కార్మికులకు ఆర్థిక సాయం విషయంపై అటు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖతో, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌, కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాలతో చర్చించాకే ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మొత్తం చెల్లించడం కష్టమైనప్పటికీ భరించడానికి సిద్ధపడ్డామన్నారు. 70 టన్నుల క్రేన్‌ చివరి ట్రయల్‌ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి కారణాలు వెల్లడిస్తామన్నారు. అంతర్గత కమిటీ వేశామని, పారదర్శకంగా విచారణ జరుగుతుందని స్పష్టంచేశారు.  

Updated Date - 2020-08-03T09:46:01+05:30 IST