కోతలు.. వాతలు..

ABN , First Publish Date - 2020-05-31T09:28:49+05:30 IST

రాష్ట్ర ము ఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. అయితే జిల్లా అభివృద్ధికి సంబంధిం చి అనేక అంశాల్లో పురోగతి కరువైంది.

కోతలు.. వాతలు..

- ఏడాది పాలనలో వైసీపీ తీరు

- 3 లక్షలమంది తల్లులకు అందని అమ్మఒడి

- పంటకు ధరా లేదు.. స్థిరీకరణ నిధి లేదు

- అన్నొచ్చాడు రేషన్‌, పింఛన్‌ కోసేశాడు

- నీటి కాలువల్లో పారుతున్న హామీల నిర్లక్ష్యం

- షాక్‌ కొడుతున్న కరెంటు బిల్లులు

- కానరాని కొత్త పరి‘శ్రమ’లు

- సీఎం వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనలో నెరవేరని పాదయాత్ర హామీలు


అనంతపురం, మే 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ము ఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. అయితే జిల్లా అభివృద్ధికి సంబంధిం చి అనేక అంశాల్లో పురోగతి కరువైంది. ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, గత ప్రభుత్వం చేపట్టిన పథకాల కొనసాగింపు మందగించింది. అందరివా డిగా ముద్ర వేసుకోలేకపోయారన్న వాదన పలు వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభు త్వాధినేతగా వైఎస్‌ జగన్‌ కొన్ని వర్గాలకే నేనున్నా నంటూ తన ఏడాది పాలనలో భరోసా కల్పించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాసుల పంపకాలతోనే సరిపె ట్టారు. అభివృద్ధికి మంగళం పాడారు. ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామని ఆ వర్గాల్లో భ్రమలు కల్పించారే కానీ పరిహారమివ్వకుండా మొండిచేయి చూ పారు. పెట్టుబడి సాయం అందించడంలో చూపిన శ్రద్ధ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించ డంలో చూపలేదు.


కరువు జిల్లాలో వలసల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఉపాధి మార్గాలు పెంచేం దుకు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మీన మేషాలు లెక్కించారు. ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా 2017 డిసెంబరు 4న నుంచి 26 వరకూ అంటే 22 రోజుల పాటు జిల్లాలో యాత్ర కొన సాగించారు. యాత్రలో భాగంగా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో అత్యధికం అమలుకు నోచుకోలేదు. చేనేత, ఆటోడ్రైవర్లు, రజకులు, ఇమామ్‌, మౌజాన్‌, పాస్టర్‌, అర్చ కులు ఇలా కొన్ని వర్గాలకు నగదు సాయం అందజే యడంతోనే సరిపెట్టారు. హంద్రీ నీవా ప్రధాన కాలువను విస్తరించడంతో పాటు డిస్ర్టిబ్యూటరీ ఏర్పాటుపై శ్రద్ధ చూపడంలో పూర్తిస్థాయిలో అలసత్వం వహించారు. వల సలు నివారించేందుకు ఏకైక మార్గం పరిశ్రమలను ఏర్పా టు చేయాలన్న హామీని విస్మరించారు. ఈ ఏడాది కాలంలో చెప్పిన మాటలకూ చేసిన చేతలకు పొంతన లేకుండా పోయింది. 


 కొందరికే అమ్మఒడి

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు అమ్మ ఒడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ అమ్మల్లో కొందరికే లబ్ధి చేకూరింది. జిల్లాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ 6,88,687 మంది విద్యార్థులు అమ్మఒడి కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొదటి విడతలో 5,43,058 మంది విద్యార్థులు అర్హత పొందినట్లు అధికారులు తేల్చినా ఆఖరికి 3,62,579 మంది తల్లుల ఖా తాలకే అమ్మఒడి డబ్బు జమ చేశారు. దాదాపు 3 లక్షల మంది తల్లులకు నిరాశే ఎదురైంది. 


నీటిమీద రాతలా ధరల స్థిరీకరణ నిధి

రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి కరువు జిల్లా రైతులను ఆదుకుంటామన్న జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికాగానే ఆ విషయాన్ని మరిచారు.   రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్న హామీ నెరవేరలేదు. ఇప్పటి వరకూ ఏ ఒక్క రైతుకూ వడ్డీలేని రుణం అందలే దు. అన్ని రకాల పంటలకు మద్ధతు ధర కల్పిస్తామని చె ప్పినా ఆచరణలో కనిపించలేదు. కంది, వేరుశనగ మిన హా ఏ పంటలకూ ఇప్పటి వరకూ గిట్టుబాటు ధర కల్పిం చకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు పండించిన పంటలు నిలువ చేసుకునేందుకు ప్రతి మం డల కేంద్రంలోనూ కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రకృతి విపత్తుల మూలంగా నష్టపోయిన రైతును ఆదుకుంటామ ని ప్రకటించారు. అయితే ఇటీవలే అకాల వర్షం, ఈదురు గాలుల బీభత్సంతో దాదాపు 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఒక్క పైసా  నష్టపరిహారం చెల్లించలేదు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 5 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దాదాపు 35 బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తు న్నాయి. 


పింఛన్‌లు, రేషన్‌లలో కోత

వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనలో పింఛన్‌లు, రేషన్‌లలో భారీగా కోత పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 12.19 లక్షలు రేషన్‌ కార్డులుండగా వైసీపీ అధి కారంలోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య 10.67కు పడిపో యింది. ఈ లెక్కన 1.52 లక్షల రేషన్‌కార్డులు తొలగించా రు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌లు 4.81 లక్షల మందికి అందించేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే దాదాపు 36 వేల మంది పింఛన్‌లకు కోత పడింది.  


చార్జీల పెంపుతో కరెంటు షాక్‌

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా పెద్దవడుగూ రు బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచమని జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. కరెంటు బిల్లుల విషయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. అయితే అధికారంలోకి రాగానే  కరెంటు చార్జీలు చాపకింద నీరులా పెంచేశారు. లాక్‌డౌన్‌ ముసుగులో ఈ ప్రక్రియనంతా ముగించేశారు.   స్లాబ్‌ పేరుతో వేలకు వేలు రూపాయలు సగటు మనిషి పై కరెంటు చార్జీలు బాదాడు.  వామ్మో ! ఇవెక్కడి కరెం టు బిల్లులంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  ఉదాహ రణకు నెలకు రూ. 400 వచ్చే కరెంటు బిల్లు ఏకంగా రూ. 2 వేలకు పెరిగిందంటే చార్జీలు ఏ స్థాయిలో షాకిచ్చాయో అర్థం చేసుకోవచ్చు. 


యాడికి కాలువకు నీరేది ?

ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పెద్దవడుగూరు పర్యటనలో యాడికి కాలు వకు నిరంతరాయంగా నీటిని అందిస్తామని హామీ ఇచ్చా రు. తాగు, సాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. అయితే అధికారం చేపట్టి ఏడాది గడిచినా  ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు.  


లక్ష ఎకరాలకు సాగునీరు హుళక్కే !

హంద్రీనీవా నుంచి కాలువల ద్వారా రాప్తాడు నియో జకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ కాలువల గురిం చే ప్రస్తావన లేకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ హంద్రీనీవా ద్వారా ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేదంటే అతిశయోక్తి లేదు. హంద్రీనీవా విస్తరణ ఏడాది గడిచినా ప్రతిపాదన దశలోనే ఉంది.  


సోలార్‌ బాధిత రైతులకు అందని పరిహారం 

వైఎస్‌ జగన్‌ కదిరి, గాండ్లపెంట, ఎన్పీకుంట మండలా ల మీదుగా పాదయాత్ర చేపట్టారు. ఆయా ప్రాంతాల బహిరంగ సభల్లో ఎన్పీకుంటలో ఉన్న సోలార్‌ రైతులకు ఎకరాకు రూ. 2 లక్షలు పరిహారం అందజేస్తానని హామీ ఇచ్చారు.  ఏడాది పాలన ముగిసినప్పటికీ  ఎన్పీకుంట సోలార్‌ బాధిత రైతుల్లో ఇంకా కొంత మందికి పరిహారం అందలేదు. 55 మంది డీ పట్టా రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. హంద్రీనీవా ద్వారా ఇప్పటికీ తలు పుల, ఎన్పీకుంట చెరువులు నింపలేదు. కదిరిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఇప్పటికీ హామీగానే మిగిలిపోయింది. 


కొత్త పరిశ్రమల ఊసేది

ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్‌ గుత్తి బహిరంగ సభలో గుంతకల్లు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పా టు చేసి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. గుంతకల్లు స్పిన్నింగ్‌ మిల్‌ తెరిపించకపోగా ఏ ఒక్క కొత్త పరిశ్రమను అక్కడ నెలకొల్పలేదు. అదే విధంగా ప్రభుత్వాస్పత్రిని అభివృద్ధి చేయడంతో పాటు గుంతకల్లులో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికీ ఆ హామీ సాకారం కాలేదు.  


శింగనమల చెరువు లోకలైజేషన్‌ హామీ కంచికి 

శింగనమల చెరువు లోకలైజేషన్‌ చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ప్రతిపాదనగానీ, ఆ ప్రస్తావనగానీ ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తామని ముఖ్యమంత్రి  నమ్మించారు. అయితే ఏడాది గడిచినా ఆ హామీ నెరవేరలేదు. చాగల్లు రిజర్వాయర్‌ కింద ఉన్న ఉల్లికల్లు గ్రామస్థులకు ముంపు పరిహారం అందిస్తామని చెప్పినప్పటికీ ఇంకా వారికి పరిహారం అందలేదు. పెన్నానదిపై చిట్టూరు నుంచి  తరిమెలకు బ్రిడ్జి నిర్మాణంతో పాటు మిడ్‌పెన్నార్‌ ఐదవ దక్షిణ కాలువ బైపాస్‌ పనులు చేపడుతామని హామీ ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటీ నెరలేరలేదు.

Updated Date - 2020-05-31T09:28:49+05:30 IST