కర్నూలు జిల్లాలో CM Jagan పర్యటన ఇలా...

ABN , First Publish Date - 2022-05-17T12:41:11+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో CM Jagan పర్యటన ఇలా...

కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) నేడు కర్నూలు జిల్లాలో పర్యటించరెన్నారు. ఓర్వకల్లు మండలం గుమితం తండా దగ్గర ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)కు సీఎం జగన్‌ శంకుస్థాన చేయనున్నారు. 


- ఇవాళ ఉదయం 9.35 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి సీఎం జగన్‌ బయలుదేరుతారు. 

- 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 

- ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు.

- 11.15 గంటలకు గుమితం తండా గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.

- 11.35 గంటల నుంచి 12.15 గంటల వరకు ఈ ప్రాజెక్టు శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్టు ప్రాధాన్యంపై చర్చిస్తారు.

- అనంతరం 12.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వెళ్లి... 12.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరు కుంటారు. 

- 1.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని... అక్కడి నుంచి 2.05 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటాని జిల్లా అధికారులు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం రాత్రి వరకు కలెక్టర్‌ కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


పకడ్బందీగా ఏర్పాట్లు..

సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి హామ్లెట్‌ గుమితం తండా వద్ద ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపనలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  సోమవారం కలెక్టర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రీన్‌కో అధికారులతో చర్చించారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమం నిర్వహణ, తదితర అంశాలపై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరిప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T12:41:11+05:30 IST