బాలినేని, మహీధర్‌ మాటలపై CM Jagan అసహనం.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2022-06-09T21:39:52+05:30 IST

బాలినేని, మహీధర్‌ మాటలపై CM Jagan అసహనం.. అసలేం జరిగింది..!?

బాలినేని, మహీధర్‌ మాటలపై CM Jagan అసహనం.. అసలేం జరిగింది..!?

  • సీఎం స్పందనపై వైసీపీ కేడర్‌ విస్మయం
  • వారు చెప్పిందంతా నిజమే కదా అంటూ వ్యాఖ్యానాలు 
  • విద్యుత్‌, ఇసుక సమస్యపై మహీధర్‌ను కస్సుమన్న జగన్‌ 
  • 3 నియోజకవర్గాల సమస్యపై ప్రత్యేక దృష్టి 

ఒంగోలు : ప్రజా సమస్యలను, సంక్షేమ పథకాల అమలులో లో పాలను ప్రస్తావించిన సీనియర్‌ ఎమ్మెల్యేలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఒకదశలో ఇసుక సమస్యను ప్రస్తావించిన మాజీమంత్రి, కందుకూరు ఎమ్మెల్యే మహీ ధరరెడ్డిపై కన్నెర్ర జేశారు. మరో మాజీ మంత్రి బాలినేని అమ్మఒడి లబ్ధిదారుల అంశాన్ని ప్రస్తావించిన సందర్భం లో కూడా అసహనం వ్యక్తం చేస్తూనే పథకం అమలులో లోపాలున్నాయన్న విషయాన్ని అంగీకరించారు. రానున్న ఆరునెలల పనితీరే గీటురాయి అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే లు, ఇన్‌చార్జ్‌లను హెచ్చరించిన జగన్‌ కిందిస్థాయిలో ఉ న్న పరిస్థితిని వివరించబోతే అసహనం వ్యక్తం చేయటం సమంజసం కాదంటూ జిల్లాలోని ఆ పార్టీ కేడరే విస్మయా న్ని వ్యక్తం చేస్తోంది. తాడేపల్లిలో బుధవారం జరిగిన వ ర్క్‌షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


అనర్హులను తొలగించకూడదా..?

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడ పకు మన ప్రభుత్వం కార్యక్రమమే ప్రధాన అజెండాగా రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ఆ పార్టీ లోని కీలక నేతలకు బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడిన తర్వాత ఎ మ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. 20మంది వరకు మాట్లాడగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,  మహీధరరెడ్డిలు కొన్ని కీ లకమైన సమస్యలను ప్రస్తావించారు. ముందుగా మాట్లా డిన బాలినేని అమ్మఒడిలో లబ్దిదారులను కుదించటం సమంజసం కాదన్నారు. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే ఏడెనిమిది వేలమంది లబ్ధిదారులను తొలగించారని సీ ఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం వా రంతా అనర్హులు కాబట్టి ఇవ్వలేదని బదులిచ్చారు. తొ లివిడతలో ఉన్న లబ్ధిదారులనే తొలగించారని బాలినేని మళ్లీ వ్యాఖ్యానించారు. దీంతో సీఎం కాస్త అసహనంగా అనర్హులు లబ్ధిదారులుగా ఉంటే తొలగించకూడదా, తొలి రెండువిడతల్లో అలాంటి వారికి డబ్బులు వేయటం ఏదో పొరపాటు జరిగింది, అందువల్ల సవరించామన్నారు.


మూడు అంశాలు ప్రస్తావించిన మహీధర్‌ 

కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డి మాట్లాడుతూ మ న ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు చేసిన పనుల బిల్లులే ఇంతవరకు రాలేదని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే గ్రామాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని, తాము గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ఆ సమ స్యను ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారన్నారు. ఇసుక సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఆ విషయంపై అవసరమైన చ ర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే సీఎం అసహ నం వ్యక్తం చేయటంతో పాటు కాస్త ఆగ్రహంతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఏబీఎన్‌లో వేస్తారు. ఆంధ్రజ్యో తిలో రాస్తారు. అవి చూసి ఎవడెవడో ఏదేదో మాట్లాడ తారు, మీరు నిజాలు తెలుసుకోకుండా ఇక్కడ మాట్లాడ టం కరెక్టు కాదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పనులకు బిల్లులు విడుదల కాబోతున్నాయని, రాష్ట్రంలో ఒక్కరోజు మినహా విద్యుత్‌ సమస్య లేదని, ఇసుక విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.750కోట్ల ఆదాయం వస్తుందని, గతంలో ఈ మొత్తం చంద్రబాబు జేబులోకి వెళ్లిందని, ఆ విషయా న్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటం కరెక్టు కాదని అ న్నట్లు సమాచారం.


కేడర్‌ విస్మయం 

కాగా సమావేశంలో చోటుచేసుకున్న ఈ అంశాలు వెలుగులోకి రావటం, సోషల్‌ మీడియాలో ప్రచారం కావ టంతో సాయంత్రానికి ఉమ్మడి జిల్లా అంతా ఇదే చర్చనీ యాంశమైంది. ముఖ్యంగా సీఎం జగన్‌ అసహనాన్ని ప్ర దర్శించటం పట్ల ఆ పార్టీ శ్రేణులే విస్మయాన్ని వ్యక్తం చే స్తున్నారు. అటు బాలినేని, ఇటు మహీధరరెడ్డి ప్రస్తావిం చిన అంశాలన్నీ నిజమేనని, అయినా సానుకూలంగా స్పందించకుండా సీఎం ఆగ్రహాన్ని ప్రదర్శించటం రాజకీ యంగా పార్టీకి నష్టమేనని ద్వితీయశ్రేణి నాయకులు బా హాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 


ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

కాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 3 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఈ సంద ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గి ద్దలూరు, చీరాల, పర్చూరులపై ప్రత్యేకదృష్టిని కేంద్రీకరిం చాలని సూచించారు. ఇప్పటికి కార్యక్రమం ప్రారంభమై 27రోజులు అయితే అత్యధిక రోజులు కార్యక్రమం జరిగిన నియోజకవర్గంగా అద్దంకిని గుర్తించారు.


ఒకే ఒక్కరోజు కార్యక్రమాన్ని ప్రారంభించి జరగని నియోజకవర్గంగా గిద్దలూరును గుర్తించారు. దీనికితోడు చీరాలలో కరణం వెంకటేష్‌కు బాధ్యతలు ఇచ్చినప్పటికీ స్థానికంగా కొందరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు ని ర్వహించటాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. పర్చూరు ఇన్‌చార్జ్‌ మార్పు వ్యవహారం పెండింగ్‌లో పడినందున ప్రస్తుత ఇన్‌చార్జ్‌ రాంబాబునే కార్యక్రమం కొనసాగించాలని కోరారు.

Updated Date - 2022-06-09T21:39:52+05:30 IST