Abn logo
May 30 2020 @ 09:38AM

అత్యవసర సేవల కోసం లోకల్ రైళ్లు నడపండి

Kaakateeya

రైల్వే మంత్రిత్వశాఖకు సీఎం లేఖ

ముంబై : కరోనా వైరస్ ముమ్మరంగా ప్రబలుతున్న నేపథ్యంలో అత్యవసర సేవల కోసం ముంబై నగరంలో లోకల్ రైళ్లు నడపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. ఈ మేర సీఎం రైల్వేశాఖకు లేఖ రాశారు. కరోనా వైరస్ పై అధికారులతో సమీక్షించిన సీఎం ఎమర్జెన్సీ సేవల కోసం లోకల్ రైళ్లు నడపాలని సీఎం కోరారు. ప్రైవేటు డాక్టర్లకు కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్లను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వైద్యులు క్లినిక్ లు తెరచి వైద్యం అందించాలని సీఎం కోరారు. కరోనా పరీక్షలు జరిపేందుకు 72 లాబోరేటరీలను ప్రారంభించామని సీఎం చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement