Abn logo
Nov 29 2020 @ 00:10AM

7న సీఎం జగన్‌ రాక

దేవరపల్లి హైస్కూల్‌లో హెలిప్యాడ్‌ని పరిశీలిస్తున్న ఎస్పీ నారాయణ్‌ నాయక్‌

దేవరపల్లి, నవంబరు 28 : వచ్చే నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి దేవ రపల్లిలో జరిగే తన కుమార్తె రిసెప్షన్‌కు హాజరు కానున్నట్టు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌తో కలిసి కరుటూరి ఫంక్షన్‌ హాలును, దేవరపల్లి హైస్కూ ల్‌లోని హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించి సీఎం పర్యటన, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. డీఎస్పీ బి.శ్రీనాఽథ్‌, సీఐ ఎం.సురేష్‌, ఎస్సై స్వామి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కేవీకే దుర్గారావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement