సుగాలి కుటుంబాలను కలుసుకున్న Cm

ABN , First Publish Date - 2022-07-03T15:39:38+05:30 IST

నామక్కల్‌ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం సాయంత్రం సుగాలీల కాలనీకి వెళ్లారు. నామక్కల్‌లో ఆదివారం సీఎం అధ్యక్షతన

సుగాలి కుటుంబాలను కలుసుకున్న Cm

పెరంబూర్‌(చెన్నై), జూలై 2: నామక్కల్‌ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం సాయంత్రం సుగాలీల కాలనీకి వెళ్లారు. నామక్కల్‌లో ఆదివారం సీఎం అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, పట్టణ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమాశేవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నామక్కల్‌ వెళ్లిన సీఎం సిలువాంపట్టిలోని సుగాలీల కాలనీని పరిశీలించారు. సీఎం రాకతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు సీఎంతో సెల్ఫీలు తీసుకున్నారు. వారి సమస్యలు విన్న ముఖ్యమంత్రి, ఓ ఇంట్లో తేనీరు సేవించారు.

Updated Date - 2022-07-03T15:39:38+05:30 IST