Cm Stalinపై పరువు నష్టం కేసు

ABN , First Publish Date - 2022-04-19T15:59:42+05:30 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన అల్లుడు శబరీశన్‌ తదితరులపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌ వేసిన పరువు నష్టం కేసు విచారణకు మద్రాసు హైకోర్టు స్టే

Cm Stalinపై పరువు నష్టం కేసు

                      - విచారణపై హైకోర్టు స్టే


ప్యారీస్‌(చెన్నై): ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన అల్లుడు శబరీశన్‌ తదితరులపై  మాజీ డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌ వేసిన పరువు నష్టం కేసు విచారణకు మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసి, ఆ దృశ్యాలు వీడియో తీసి బెదిరించిన సంఘటనల్లో పొల్లాచ్చి జయరామన్‌కు సంబంధాలున్నాయంటూ సీఎం స్టాలిన్‌ విమర్శించినట్లు కలైంజర్‌ ఛానల్‌, నక్కీరన్‌, జూనియర్‌ వికడన్‌ మాసపత్రికలో కథనాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా సోషల్‌ మీడియాలో మాట్లాడిన స్టాలిన్‌కు వ్యతిరేకంగా పొల్లాచ్చి జయరామన్‌ మద్రాసు హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు.  సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తుల బెంచ్‌, కేసు విచారణకు తాత్కాలికంగా స్టే విధిస్తూ, తదుపరి విచారణ జూన్‌ 10వ తేదీకి వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-04-19T15:59:42+05:30 IST