సీఎం స్టాలిన్‌ పాలన భేష్‌

ABN , First Publish Date - 2022-06-04T14:34:56+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌

సీఎం స్టాలిన్‌ పాలన భేష్‌

                  - టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి


అడయార్‌(చెన్నై), జూన్‌ 3: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి అభిప్రాయపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 99వ జయంతి వేడుకలను పురస్కరించుకని ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 50 యేళ్లకుపైగా రాజకీయ అనుభవం కలిగిన స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా అద్భుత పాలన అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారన్నారు. అందుకే ఆయన పాలన చాలా సంతోషం కలిగిస్తుందని కొనియాడారు. 

Updated Date - 2022-06-04T14:34:56+05:30 IST