వర్షబాధిత ప్రాంతాల్లో Cm పరిశీలన

ABN , First Publish Date - 2021-12-07T16:55:14+05:30 IST

స్థానిక మనలి న్యూటౌన్‌, వడివుడైయమ్మన్‌ నగర్‌లో వర్షబాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మనలి న్యూటౌన్‌ తదితర

వర్షబాధిత ప్రాంతాల్లో Cm పరిశీలన

చెన్నై: స్థానిక మనలి న్యూటౌన్‌, వడివుడైయమ్మన్‌ నగర్‌లో వర్షబాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మనలి న్యూటౌన్‌ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. ఆ ప్రాంతంలోని జననివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో గత నవంబర్‌ 20న స్టాలిన్‌ ఆ ప్రాంతాలను సందర్శించి చేపట్టాల్సిన పునరావస చర్యలపై అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనలి న్యూటౌన్‌, వడివుడైయమ్మన్‌ నగర్‌లో వర్షబాధిత ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న పునరావాస పనులను స్టాలిన్‌ తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను కలుసుకుని సహాయక పనుల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలూకా వెల్లివాయల్‌ వద్ద తెగిన కుశస్థలి వాగు ప్రాంతాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు. స్టాలిన్‌తోపాటు మంత్రి పీకే శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, శాసనసభ్యులు ఎస్‌. సుదర్శనం, దురై చంద్రశేఖర్‌ పర్యటించారు.

Updated Date - 2021-12-07T16:55:14+05:30 IST