మహిళలకు విద్య నిరంతర సొత్తు

ABN , First Publish Date - 2022-03-22T16:53:12+05:30 IST

మహిళలకు విద్యనిరంతర సొత్తు అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు.

మహిళలకు విద్య నిరంతర సొత్తు

సీఎం స్టాలిన్‌

పెరంబూర్‌, మార్చి 21:మహిళలకు విద్యనిరంతర సొత్తు అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అందిస్తున్న తాళికి బంగారం, ఆర్ధిక సాయం నిలిపివేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి శాసనసభలో వివరణ ఇచ్చారు. గతంలో అందిస్తు న్న ఈ పథకంలో పలు అవినీతి చోటుచేసుకుందని సీఐజీ అందజేసిన నివేదికలో తేలిందని, కేవలం 23 శాతం మంది మాత్రమే లబ్దిపొందుతున్నారని తెలిసిందన్నారు. మహిళలకు విద్యనిరంతర సొత్తు అనే విషయాన్ని అందరూ గుర్తెరగాలని కోరారు. గతంలో అమలుచేసిన తాళికి బంగారం పథకంలో లక్ష మంది మాత్రమే లబ్ది చేకూరుతుండగా, ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తున్న 6లక్షలమంది మహిళ లు ప్రయోజనం పొందనున్నారని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-22T16:53:12+05:30 IST