CM Stalin: డీజీపీ కార్యాలయంలో ‘మీ శాఖలో సీఎం’

ABN , First Publish Date - 2022-09-23T16:08:07+05:30 IST

పోలీసుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే దిశగా డీజీపీ కార్యాలయంలో గురువారం ‘మీ శాఖలో సీఎం’ పథకాన్ని ముఖ్య

CM Stalin: డీజీపీ కార్యాలయంలో ‘మీ శాఖలో సీఎం’

                                    - వినతి పత్రాలు స్వీకరించిన స్టాలిన్‌

 

చెన్నై, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే దిశగా డీజీపీ కార్యాలయంలో గురువారం ‘మీ శాఖలో సీఎం’ పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రారంభించారు. ముందుగా డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో మొక్క నాటిన అనంతరం పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో అధికారులు, కానిస్టేబుళ్ల నుంచి స్టాలిన్‌ వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి ఫణీందర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు,, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, అదనపు డీజీపీ తామరై కన్నన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ  సందర్శకుల పుస్తకంలో స్టాలిన్‌ సంతకం చేశారు.

Updated Date - 2022-09-23T16:08:07+05:30 IST