Stalin దళిత పక్షపాతి

ABN , First Publish Date - 2022-03-05T15:21:56+05:30 IST

అణగారిన వర్గాలకు చెందిన వారిని మేయర్‌, పంచాయతీ ఛైర్మెన్‌ తదితర ఉన్నత పదవులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ దళిత పక్షపాతి అని క్రిస్టియన్‌ బిలీవర్స్‌ ఫెలోషిప్‌ (సీబీఎఫ్‌) డైరెక్టర్‌ రెవ.జడ

Stalin దళిత పక్షపాతి

                   - సీబీఎఫ్‌ డైరెక్టర్‌ జడ వసంతబాబు


ప్యారీస్‌(చెన్నై): అణగారిన వర్గాలకు చెందిన వారిని మేయర్‌, పంచాయతీ ఛైర్మెన్‌ తదితర ఉన్నత పదవులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ దళిత పక్షపాతి అని క్రిస్టియన్‌ బిలీవర్స్‌ ఫెలోషిప్‌ (సీబీఎఫ్‌) డైరెక్టర్‌ రెవ.జడ వసంతబాబు ప్రశంసించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) తొలి దళిత మహిళా మేయర్‌గా ప్రియ శుక్రవారం పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వసంతబాబు ఆమెకు ఈ అవకాశం కల్పించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2022-03-05T15:21:56+05:30 IST