CM సైకిల్‌ సవారీ

ABN , First Publish Date - 2022-01-09T13:41:03+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో సైకిల్‌ యాత్ర నిర్వహించారు. స్టాలిన్‌ ప్రతిరోజూ ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీరిక సమయాల్లో ఉదయం పూట సైక్లింగ్‌ చేయటం ఆనవాయితీగా

CM సైకిల్‌ సవారీ

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో సైకిల్‌ యాత్ర నిర్వహించారు. స్టాలిన్‌ ప్రతిరోజూ ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీరిక సమయాల్లో ఉదయం పూట సైక్లింగ్‌ చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ మేరకు శనివారం ఉదయం రంగుల టీషర్టు, ఫ్యాంటు, హెల్మెట్‌ ధరించి సైకిల్‌పై వెళ్ళారు. మార్గమధ్యంలో ఓ టీ షాపు వద్దకు వెళ్ళి టీ తాగారు. అక్కడే ఓ విద్యార్థితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం స్టాలిన్‌ సైకిల్‌ సవారీ వీడియో దృశ్యాలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-01-09T13:41:03+05:30 IST