Cm Comments: ఆరోగ్యాన్ని కాపాడుకోండి

ABN , First Publish Date - 2022-07-28T15:49:34+05:30 IST

పాఠశాల విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని, అప్పుడే చక్కగా చదువుకోగలుగుతారని ముఖ్యమంత్రి

Cm Comments: ఆరోగ్యాన్ని కాపాడుకోండి

చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని, అప్పుడే చక్కగా చదువుకోగలుగుతారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Stalin) పేర్కొన్నారు. అశోక్‌నగర్‌లో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్యంపై ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేష్‌(Anbil Mahesh), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, మేయర్‌ ప్రియా, డిప్యూటీ మేయర్‌ మహేష్‏కుమార్‌, శాసనసభ్యులు జె. కరుణానిధి, వేలు, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉషా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-28T15:49:34+05:30 IST