New buildings: సాంకేతిక శిక్షణ, ఉపాధికల్పనా కేంద్రాలకు కొత్త భవనాలు

ABN , First Publish Date - 2022-08-02T14:15:23+05:30 IST

రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ, ప్రతిభాపాటవాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రూ.29.75 కోట్లతో నిర్మించిన సాంకేతిక శిక్షణా కేంద్రాలు, ఉపాధి కల్పనా కేంద్రాల

New buildings: సాంకేతిక శిక్షణ, ఉపాధికల్పనా కేంద్రాలకు కొత్త భవనాలు

చెన్నై, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ, ప్రతిభాపాటవాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రూ.29.75 కోట్లతో నిర్మించిన సాంకేతిక శిక్షణా కేంద్రాలు, ఉపాధి కల్పనా కేంద్రాల కొత్త భవనాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రారంభోత్సవం చేశారు. సచివాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఉడుమలైపేటలో రూ.5.56 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ భవనం, హాస్టల్‌ భవనం, నాగర్‌కోవిల్‌లో బాలికల ఐటీఐ(ITI for Girls)లో టెక్నీషియన్‌, మెడికల్‌ ఎలక్ర్టానిక్స్‌ శిక్షణ కోసం రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన వర్క్‌షాప్‌ భవనం, తరగతి గదుల భవనాన్ని, విరుదునగర్‌ ప్రభుత్వ ఐటీఐలో కొత్త కోర్సులకు అనువుగా రూ.2.05 కోట్లతో నిర్మించిన వర్కషాప్‌ భవనం, తరగతి గదుల భవనాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్‌(Video conferencing) ద్వారా ప్రారంభించారు. ఇదే విధంగా తిరుచ్చి ఐటీఐలో లిఫ్ట్‌, ఎస్కలేటర్‌ మెకానికల్‌ కోర్సులకుగాను రూ.99 లక్షల వ్యయంతో నిర్మించిన వర్క్‌షాప్‌ భవనం, తరగతి గదుల భవనాన్ని, కోయంబత్తూరు ఐటీఐలో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్‌ తరగతి గదుల భవనం, గ్రంథాలయం భవనాన్ని ప్రారంభించారు. గిండీలోని ఉపాధి కల్పనా కేంద్రంలో రూ.3.30 కోట్లతో కొత్తగా నిర్మించిన చెన్నై ఉపాధి కల్పనా కేంద్రం భవనం, ఉపాధి కల్పనా విభాగం జోనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయపు భవాన్ని కూడా ఆయన ప్రారంభించారు. మదురై (బాలికల ఐటీఐ), తూత్తుకుడి, నాగలాపురం, నామక్కల్‌, అంబాసముద్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో రూ.14.63 కోట్లతో నిర్మించిన ఐదు  హాస్టల్‌ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి(Anbil Mahesh Poyyamoli), కార్మికుల సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేశన్‌, కార్మిక సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


మున్సిపాలిటీలకు 187 కొత్త వాహనాలు

సచివాలయం వెలుపల ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో నగరపాలక శాఖ ఆధ్వర్యంలో మునిసిపాలిటీలకు రూ.23.66 కోట్లతో కొనుగోలు చేసిన 187 కొత్త వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను మునిసిపాలిటీ అధ్యక్షులు, కమిషనర్లు, ఇంజనీర్లకు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొంతమంది మునిసిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లకు కొత్త వాహనాల తాళాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక వాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ, నగరపాలక శాఖ సంచాలకులు పి. పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T14:15:23+05:30 IST