ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

ABN , First Publish Date - 2022-03-23T14:11:06+05:30 IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరు స్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పునరుద్ఘాటించారు.

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

                        - శాసనసభలో సీఎం వెల్లడి


ప్యారీస్‌(చెన్నై): గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరు స్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పునరుద్ఘాటించారు. మంగళవారం ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యుడు శాసనసభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకే అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యే లు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. హామీల గురించి తమను ప్రశ్నిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. ఇంతకు ముందు పదేళ్ల పాటు తమ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వారి విమర్శల సంగతె లాగున్నా.. తాము మాత్రం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. గత పది నెలల్లో ప్రభుత్వం సాధించినన్ని విజయాలు మరే ప్రభుత్వమూ సాధించలేదన్నారు. తాము ప్రజలకు చేయదలచుకున్న మేలు కోసం ఇటీవల బడ్జెట్‌లోనూ స్పష్టంగా చెప్పామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని డీఎంకే ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య సీఎం ప్రకటించారు. 

Updated Date - 2022-03-23T14:11:06+05:30 IST