ఈ విజయం బాధ్యతను మరింత పెంచింది

ABN , First Publish Date - 2022-02-23T14:29:22+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగించడంపై ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి విజయాన్ని చేకూర్చి పెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ

ఈ విజయం బాధ్యతను మరింత పెంచింది

- మా పాలనకు ప్రజలిచ్చిన సర్టిఫికెట్‌

- అన్నాడీఎంకే కంచుకోట బద్దలు

- సీఎం స్టాలిన్‌


అడయార్‌(చెన్నై): మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగించడంపై ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి విజయాన్ని చేకూర్చి పెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో తాము గర్వించడం లేదని, ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన స్టాలిన్‌.. కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం తమ తొమ్మిది నెలల పాలనకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌ లాంటిదన్నారు. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఆడంబరంగా జరుపుకో వాల్సిన అవసరం లేదన్నారు. ఇది తమకు బాధ్యతలాంటిదేనన్న విషయాన్ని గుర్తెరగాలని వినమ్రంగా ప్రకటించారు. అదేసమయంలో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న ఆరోపణ వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలకు అధికారాన్ని అప్పగించడమే డీఎంకే లక్ష్యమన్నారు. అన్నాడీ ఎంకే కంచుకోటలను సైతం బద్ధలు కొట్టామని ఆయన వెల్లడించారు. ద్రావిడ నమూనా పాలన ప్రజల ఆమోదానికి లభించిన విజయంగా స్టాలిన్‌ అభివర్ణించారు.

Updated Date - 2022-02-23T14:29:22+05:30 IST