Udayanidhiని చూసి సంతోషిస్తున్నా: Cm

ABN , First Publish Date - 2022-07-20T16:54:48+05:30 IST

డీఎంకే యువజన విభాగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఉదయనిధి ఎదుగుదలను చూసి పార్టీ అధ్యక్షుడిగా సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి ఎంకే

Udayanidhiని చూసి సంతోషిస్తున్నా: Cm

చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): డీఎంకే యువజన విభాగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఉదయనిధి ఎదుగుదలను చూసి పార్టీ అధ్యక్షుడిగా సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. డీఎంకే యువజనవిభాగం 42వ వార్షికోత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 1980 జూలై 20న అప్పటి పార్టీ అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో మదురై ఝాన్సీరాణి పార్కులో యువజన విభాగాన్ని ప్రారంభించానని, ఆ విభాగంలోనే తాను దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించానని, ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనస్సులో ఆహ్లాదం కలుగుతోందన్నారు. తాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పార్టీ యువజన విభాగం నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన ఉదయనిధి తనకంటే చక్కగా నిర్వహిస్తుండడంచూసి ముఖ్యమంత్రిగా, తండ్రిగా కాకుండా పార్టీ అధ్యక్షుడిగా మురిసిపోతున్నానని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి నేతృత్వంలోని యువజనవిభాగం నిర్వహించిన ప్రచారం పార్టీ ఘన విజయానికి దోహదపడిందని స్టాలిన్‌ ప్రశంసించారు.

Updated Date - 2022-07-20T16:54:48+05:30 IST