విమర్శలు పట్టించుకోవద్దు

ABN , First Publish Date - 2022-07-07T15:35:39+05:30 IST

విపక్షాల విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవకు అంకితమవుదామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం

విమర్శలు పట్టించుకోవద్దు

- ప్రజా సేవకే అంకితమవుదాం

- కార్యకర్తలకు సీఎం స్టాలిన్‌ బహిరంగ లేఖ

 

అడయార్‌(చెన్నై), జూలై 6: విపక్షాల విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవకు అంకితమవుదామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. డీఎంకే ప్రభుత్వం యేడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ ఫలం మారుమూల గ్రామాల ప్రజలకు చేరాలి. తిరుపత్తూరు జిల్లాలో సంక్షేమ సహాయాల పంపిణీకి గత నెల 28న బయలుదేరగా మార్గమధ్యంలో అనేక ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. పైగా ప్రతి గ్రామవాసి ఉత్సాహం నింపేలా స్వాగతం పలికారనీ, వేలూరు, రాణిపేట జిల్లాల్లో కూడా ఇదే తరహా ఉత్సాహభరితమైన స్వాగతం లభించిందని గుర్తుచేశారు. ఈ నెల ఒకటో తేదీ సచివాలయంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, పలు ఫైళ్ళపై సంతకాలు చేసి అదేరోజు సాయంత్రం తిరుచ్చికి విమానంలో వెళ్ళి, అక్కడ నుంచి కరూర్‌కు రోడ్డు మార్గలో వెళ్ళారు. అంతేకాకుండా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత ప్రగతి సాధించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకోవాలని అనేక మంది సూచించారని, నామక్కల్‌ జిల్లా పర్యటనలో దాదాపు 13 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారన్నారు. దివంగత నేత కరుణానిధి ప్రభుత్వ హయాంలో కల్పించిన 3 శాతం రిజర్వేషన్ల ఫలితంగా ఒక యువకుడు హోమియో కోర్సు పూర్తి చేసాడని, అతనింటిలో టీ తాగినిట్టు గుర్తుచేశారు. ఇదే విధంగా ప్రతి జిల్లా పర్యటనలోనూ ప్రజలు ఘనస్వాగతం పలుకున్నారు. అందువల్ల ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వంపై విపక్ష నేతలు చేసే ఉద్దేశ్వపూర్వక విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవకు అంకితమవుదామంటూ సీఎం స్టాలిన్‌ పార్టీ కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-07-07T15:35:39+05:30 IST