స్టాలిన్‌ పుస్తకావిష్కరణకు రజనీకి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-02-26T16:49:11+05:30 IST

ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రము ఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులోభాగంగా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ఆహ్వానం పంపారు.

స్టాలిన్‌ పుస్తకావిష్కరణకు రజనీకి ఆహ్వానం

                  - ఓపీఎస్‌, ఈపీఎస్‌లకు కూడా.. 


అడయార్‌(చెన్నై): ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రము ఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులోభాగంగా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ఆహ్వానం పంపారు. అదేవిధంగా అన్నాడీఎంకే కన్వీనర్‌ ఓ. పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌ ఎడప్పాడి కె.పళనిస్వామికి కూడా ఆహ్వానం వెళ్ళింది. ‘ఉంగలిల్‌ ఒరువన్‌’ పేరుతో ముఖ్యమంత్రి తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 28న నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటరులో జరుగనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వీరితోపాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బిహార్‌ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీయాదవ్‌ తదితరులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌కు ఆహ్వానం పంపారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన సీనియర్‌ రాజకీయ నేతలైన ఓపీఎస్‌, ఈపీఎస్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌, పీఎంకే వ్యవస్థాక అధ్యక్షుడు డాక్టర్‌ రాందాస్‌ తదితరులకు కూడా ఆహ్వానాలు పంపించారు. 

Updated Date - 2022-02-26T16:49:11+05:30 IST