Chief Minister: వ్యవసాయశాఖకు నూతన భవనాలు

ABN , First Publish Date - 2022-09-07T14:24:09+05:30 IST

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూ.125.28 కోట్లతో నిర్మించిన 11 వ్యవసాయ విస్తరణ కేంద్రాల భవనాలు, ప్రయోగశాలలు, భూసార పరీక్షా కేంద్రాల

Chief Minister: వ్యవసాయశాఖకు నూతన భవనాలు

- రూ.125.28 కోట్లతో నూతన భవనాలు

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూ.125.28 కోట్లతో నిర్మించిన 11 వ్యవసాయ విస్తరణ కేంద్రాల భవనాలు, ప్రయోగశాలలు, భూసార పరీక్షా కేంద్రాల భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మంగళవారం ఉదయం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కొత్త భవనాలకు ఆయన వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కాట్టాన్‌కుళత్తూరు, తిరుప్పోరూరు, తిరుక్కళికుండ్రం, హోసూరు, ఊత్తంగరై, అగస్తీశ్వరపురం, ఆలంగాయం, ఉచ్చిపుల్లి, ముదుగళత్తూరు, కొంగనాపురం, నాగమంగళంలో రూ.22.80 కోట్లతో నిర్మించిన సమైక్య వ్యవస్థాయ విస్తరణ కేంద్రాల భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. కడలూరులో కొత్తగా నిర్మించిన భూసార పరీక్షా కేంద్రం, కోవిల్‌పట్టి(Kovilpatti)లో పురుగల మందు ప్రయోగశాల భవనం, ఉద్యానవనాల శాఖ ఆధ్వర్యంలో తెర్క్‌పాల్‌పన్నచ్చేరిలో రూ.95లక్షలతో ఉద్యానవనశాఖ సమాచార శిక్షణా కేంద్రం భవనం, రూ.28.75 కోట్లతో నిర్మించిన సమైక్య మిరప వాణిజ్య కేంద్ర భవనం, తిరుచ్చిలో రూ.2కోట్లతో నిర్మించిన వ్యవసాయ ఇంజినీరింగ్‌ శిక్షణా కేంద్రం, మేట్టుపాళయంలో హార్టికల్చర్‌ కళాశాల భవనం తదితర భవనాలకు కూడా ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఇరైఅన్బు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ వి గీతాలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


3 జిల్లాల్లో స్టాలిన్‌ పర్యటన...

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం నుంచి మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుదవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో బయలుదేరి తూత్తుకుడి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి కన్నియాకుమారికి వెళతారు. కన్నియాకుమారి(Kanniyakumari) వివేకానంద స్మారక మండపం సమీపంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో తిరునల్వేలి చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం తిరునల్వేలి జిల్లాలో జరిగే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కారులో మదురైకి బయలుదేరి మార్గమధ్యంలో విరుదునగర్‌లో మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రం మదురై చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. ఈ నెల తొమ్మిది ఉదయం మదురైలో మంత్రి మూర్తి కుటుంబీకుల వివాహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. తరువాత వేలమ్మాళ్‌ గ్రూపు నిర్వాహకుల వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అదేవిధంగా మదురైలో మ్యూజియం నిర్మాణ పనులను ప్రారంభించారు. చివరగా కలైంజర్‌ గ్రంథాలయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. రాత్రి అక్కచి నుంచి విమానంలో బయలుదేరి నగరానికి  చేరుకుంటారు.

Updated Date - 2022-09-07T14:24:09+05:30 IST