నేతన్నల సంక్షేమానికి సీఎం ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2022-08-08T06:35:18+05:30 IST

నేతన్నల సంక్షేమానికి సీఎం కేసీ ఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

నేతన్నల సంక్షేమానికి సీఎం ప్రత్యేక కృషి
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నేతన్నల సంక్షేమానికి సీఎం కేసీ ఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం పుర స్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మార్కం డేయ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనను మంత్రి చేశారు. చేనేత దినోత్సవం సందర్బంగా పలువురు చేనేత కార్మికులను సన్మానిం చారు. పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, పేయింటింగ్‌ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. గతంలో ఉన్న పరిస్థితులు తెలం గాణ ఏర్పడ్డ తదుపరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చేనేత కార్మికులు గమనించాలన్నారు. సిరిసిల్లలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రూ. 50 లక్షల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కు తుందన్నారు. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన సందర్బంలో నేతన్నలకు అవ సరమైన కరెంట్‌, కలర్‌లపై సబ్సిడీలు అందించి, మార్కెటింగ్‌పై అవగా హన కల్పించి వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నాన్ని చేసి విజయం సాఽ దించిన ఘనత తెలంగాణ సర్కారుదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న నేతన్నలకు చేనేత బంధ పథకం ప్రకటించి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్‌ మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. చేనేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో మును పెన్నడూ లేని విధంగా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగా ణ సర్కారు పనిచేస్తుందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. చేనేత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుండ డం సంతోషకరమన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత మాట్లాడుతూ రాష్ట్రం లో మునుపెన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. చేనేత బంధు పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం అద్యక్షుడు రుద్ర శ్రీ ను, పలువురు పద్మశాలి సంఘ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతిని ధులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T06:35:18+05:30 IST