గిటార్ వాయిస్తున్న సీఎం.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-05-24T02:39:22+05:30 IST

గిటార్ వాయిస్తూ పాటలు పాడటం చాలామందికి అలవాటు. అయితే సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా గిటార్ వాయిస్తున్న వీడియో షేర్ చేశారు.

గిటార్ వాయిస్తున్న సీఎం.. వీడియో వైరల్

షిల్లాంగ్: గిటార్ వాయిస్తూ పాటలు పాడటం చాలామందికి అలవాటు. అయితే సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా గిటార్ వాయిస్తున్న వీడియో షేర్ చేశారు. అంతే అది క్షణాల్లోనే వైరలయింది. ఇంతకీ ఆ సీఎం ఎవరంటే.. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా. ఎలక్ట్రిక్ గిటార్‌పై ఐరన్ మెయిడెన్ అనే పాటను ఆయన వాయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను స్వయంగా షేర్ చేసిన సంగ్మా.. ‘మూడురోజుల అసెంబ్లీ సెషన్ తర్వాత ఇలా సేదతీరుతున్నా. చాలాకాలం తర్వాత వాయిస్తున్నా కొన్ని తప్పులుండొచ్చు’ అని పేర్కొన్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2020-05-24T02:39:22+05:30 IST