సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-20T05:00:58+05:30 IST

సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు
సభ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీ్‌షరావు, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

 27న పెంచికల్‌పేటలో  ‘అభినందన’ పేరిట బహిరంగసభ

 ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీ్‌షరావు, 

ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నిక 

ప్రచారానికి ఫైనల్‌ టచ్‌

ఎల్కతుర్తి, అక్టోబరు 19 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ఈ నెల 27న నిర్వహించే టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సభలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.  సభ స్థలాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీ్‌షకుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒడితెల సతీ్‌షకుమార్‌  మాట్లాడుతూ ఈ నెల 25న కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోమారు ఎన్నిక కానున్నారని, ఈ క్రమంలో ఆయనకు అభినందనగా 27న ఈ బహిరంగసభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభకు  కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, సిద్దిపేట జిల్లాల నుంచి సుమారు లక్షా 50వేల మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సభ నిర్వహణకు కరీంనగర్‌ - హనుమకొండ ప్రధాన రహదారికి ఆనుకుని పెంచికల్‌పేట గ్రామ శివారులో 60 ఎకరాల సఽ్థలాన్ని గుర్తించామని,   సభ ఏర్పాటుకు 30 ఎకరాలు, వాహనాల పార్కింగ్‌ కోసం 25 ఎకరాలు, హెలీప్యాడ్‌ కోసం 5 ఎకరాల స్థలాన్ని చదును  చేపట్టినట్లు వెల్లడించారు. సభకు వచ్చే ప్రజలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.   కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌, ఎల్కతుర్తి, హసన్‌పర్తి సీఐలు శ్రీనివాస్‌, శ్రీధర్‌రావుతో పాటు పలువురు ఎస్సైలు  భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  

టార్గెట్‌ హుజూరాబాద్‌

ప్రతిష్ఠాత్మకంగా జరుగతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొనే పెంచికల్‌పేటలో సీఎం బహిరంగసభను ఏర్పాటుచేసినట్టు తెలిసిం ది. ప్రచారపర్వం 27నే ముగుస్తుండటంతో ఓటర్ల ను ఆకట్టుకునేందుకు ఈ సభను ఉపయోగించుకోనున్నారు. ఎల్కతుర్తి మండలం హుజూరాబాద్‌ ని యోజకవర్గ పరిధిలోకి రాదు. కానీ నియోజకవర్గానికి పొరుగునే ఉంటుంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్ర చార సభలకు కఠిన నిబంధనలు విధించి, స్టార్‌ క్యాంపెయినర్లు పాల్గొనే బహిరంగ సభల్లో వెయ్యి మందికి మించి ఉండవద్దని కేంద్ర ఎన్నికల సం ఘం తేల్చి చెప్పిన విషయం విదితమే.   దీంతో  హుజూరాబాద్‌ నియోజకవర్గ సరిహద్దుల్లోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో బహిరంగ సభ ను నిర్వహించాలని నిర్ణయించారు. సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నియోజకవర్గ ప్రజలను భారీ ఎత్తున అ క్కడికి తరలించేందుకు  ప్రణాళిక రూపొందించుకొన్నది.

Updated Date - 2021-10-20T05:00:58+05:30 IST