Abn logo
Mar 26 2020 @ 16:50PM

పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటించిన సీఎం రమేష్

అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు సినీ, రాజకీయ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన విరాళాన్ని ప్రకటించారు. పీఎం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌‌తో పాటు కడప జిల్లాకు కూడా విరాళం అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 2 కోట్ల రూపాయలు... ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళాన్ని అందించనున్నట్టు తెలిపారు. అలాగే కడప జిల్లా కలెక్టర్‌కు రూ.50 లక్షలు అందజేస్తున్నానని సీఎం రమేష్ తెలిపారు.  


Advertisement