పల్లెల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి : మహేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-20T06:15:37+05:30 IST

పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామాజీపేటలో అండర్‌డ్రైనేజీ పనులను బుధవారం ప్రారంభించారు. గ్రామాలను దత్తత తీసుకొని వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతుల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టి అన్ని

పల్లెల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి : మహేందర్‌రెడ్డి
శంకుస్థాపన చేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

యాదాద్రి రూరల్‌, జనవరి 19: పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామాజీపేటలో అండర్‌డ్రైనేజీ పనులను బుధవారం ప్రారంభించారు. గ్రామాలను దత్తత తీసుకొని వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతుల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. అంతకు ముందు గ్రామంలో బైండ్ల రాంచంద్రయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంటును ప్రారంభించారు. జైభీమ్‌ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మొగిలిపాక తిరుమలరమేష్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్య, ఎంపీటీసీ ఎర్ర పోచయ్య, ఉప సర్పంచ్‌ వీరవెల్లి శేఖర్‌రెడ్డి, వార్డు సభ్యులు మారపాక సుధాకర్‌, ఆరె స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T06:15:37+05:30 IST