హైకోర్టు జడ్జి నేతృత్వంలో దర్యాప్తు: సిద్ధూ హత్యపై CM Mann

ABN , First Publish Date - 2022-05-30T19:47:39+05:30 IST

సింగర్ సిద్ధూ మూసెవాలా(Singer Sidhu Moose Wala) హత్య కేసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab chief minister Bhagwant Mann) సోమవారం ప్రకటించారు..

హైకోర్టు జడ్జి నేతృత్వంలో దర్యాప్తు: సిద్ధూ హత్యపై CM Mann

చండీగఢ్: సింగర్ సిద్ధూ మూసెవాలా(Singer Sidhu Moose Wala) హత్య కేసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు(Punjab and Haryana High Court) సిట్టింగ్ జడ్జి(sitting judge) నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab chief minister Bhagwant Mann) సోమవారం ప్రకటించారు. సిద్ధూ తండ్రి బాల్కర్ సింగ్ సిద్ధూ అభ్యర్థన మేరకు ఈ కేసును సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి అభ్యర్థిస్తుందని ఆయన తెలిపారు. ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సైతం పేర్కొన్నారు. సిద్ధూ హత్యను ఖండిస్తూనే.. ఈ దారునానికి పాల్పడ్డ వారిని కటకటాలకు నెట్టే వరకు ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తుందని, ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని మాన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-30T19:47:39+05:30 IST