స్వయంగా వృత్తాలు గీస్తూ... అవగాహన పెంచిన మమత

ABN , First Publish Date - 2020-03-27T01:25:57+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏది చేసినా సంచలనమే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో

స్వయంగా వృత్తాలు గీస్తూ... అవగాహన పెంచిన మమత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏది చేసినా సంచలనమే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీతో సహా అందరూ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే. అయినా సరే, దేశ వ్యాప్తంగా ప్రజల్లో దీనిపై అంతగా అవగాహన పెరగడం లేదు. ఈ విషయంపై అవగాహన పెంచడానికి, ఆచరణలో తీసుకురావడానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నడుం కట్టారు.


కూరగాయల మార్కెట్లో ఓ చాక్‌పీసును తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా కొలతలతో ఓ వృత్తాన్ని గీసి ప్రజలందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ స్వయంగా పోస్టు చేశారు.  అంతేకాకుండా ‘‘నో వర్డ్స్‘ (చెప్పడానికి మాటలు చాలవు) అంటూ ఈ వీడియోను ఉద్దేశించి ఓబ్రెయిన్ కామెంట్ పెట్టారు. 

Updated Date - 2020-03-27T01:25:57+05:30 IST