Abn logo
Apr 8 2021 @ 16:07PM

ప్రధాని మోదీపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి? సీఎం మమత

కోల్‌కతా : కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై సీఎం మమత విరుచుకుపడ్డారు. నందిగ్రామ్ ముస్లింలను పాకిస్తానీలంటూ వ్యాఖ్యానించిన ఎందరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అలా వ్యాఖ్యానించడానికి వారికి సిగ్గులేదా? అంటూ పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని, తాను అన్ని వర్గాల వారికీ అండగా నిలుస్తానని మమత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గురువారం ‘దామ్‌జూర్’ సభలో పాల్గొన్నారు. తనకు 10 షోకాజ్ నోటీసులు జారీ చేసినా, లెక్కచేసే ప్రసక్తే లేదన్నారు. హిందూ, ముస్లింలంటూ ప్రధాని మోదీ రోజూ ప్రచారంలో వ్యాఖ్యానిస్తారని, అలాంటి సమయంలో ఆయనపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయో చెప్పాలని దీదీ డిమాండ్ చేశారు. 


ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమత తారకేశ్వర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘దుష్టశక్తుల మాటలు విని, మీ ఓట్లను చీల్చుకోవద్దని మైనారిటీ సోదరసోదరీమణులను కోరుకుంటున్నా. సీపీఎం, బీజేపీ వారు మీ ఓట్లను చీల్చడానికి డబ్బులతో సహా దిగుతారు.’’ అంటూ సీఎం మమత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ సీఎం మమతకు నోటీసులు జారీ చేసింది.  


Advertisement
Advertisement
Advertisement