Abn logo
Mar 2 2021 @ 06:08AM

కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఎం సోదరుడు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం ఈఎం బైపాస్ సమీపంలోని చింగ్రీఘాటాలో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ సోదరుడు బాబున్ బెనర్జీ కారును వెనుక నుంచి ఒక లోడెడ్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన అనంతరం బాబున్ బెనర్జీ సంఘటనా స్థలంలోనే తన కారును విడిచిపెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. చింగ్రీఘాటా సమీపంలో ఒక మినీ మెటాడోర్ బాబున్ బెనర్జీ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబున్ బెనర్జీకి ఎటువంటి గాయాలు కాలేదు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement