Abn logo
Jul 1 2020 @ 09:36AM

108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

విజయవాడ: 108, 104 వాహనాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వేలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. వాహనాలను సీఎం ప్రారంభించాక.. కొత్త వాహనాలు జగన్ ముందు ప్రదర్శనగా వెళ్లాయి.

అత్యాధునిక సౌకర్యాలు

కొత్త అంబులెన్స్‌ల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు సదుపాయాలు పొందిపొరిచారు. చిన్నారుల కోసం ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మండల కేంద్రానికి ఒక వాహనం ఏర్పాటు చేయనున్నారు. Advertisement
Advertisement
Advertisement