Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 5: సీఎం కేసీఆర్‌ దళితులను మోసం చేస్తున్నారని  తెలంగాణ జన సమితి ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బచ్చలకూరి గోపీ  ఆరోపించారు. ‘ఏడేండ్ల తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలు– అమలు తీరుతెన్నులు’ అనే అంశంపై  సూర్యాపేటలోని గాంధీపార్కులో ఆదివారం నిర్వహించిన   రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి అని దళితులకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు.  హుజూరా బాద్‌ ఉప ఎన్నికల పూర్తయిన వెంటనే ‘దళితబంధు’ను విస్మరించడం దారుణమన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రమల్ల రాములు, మండారిడెవిడ్‌కుమార్‌, మట్టిపల్లి సైదులు, కొత్తపల్లి శివకుమార్‌, గట్లరమాశంకర్‌, దంతాలరాంబాబు,దరావత్‌ నాగేశ్వర్‌రావు, బుద్దసత్యనారాయణ, యాతాకుల సునీల్‌, కోటగోపి, కిరణ్‌, దాసరిరాములు,అరుణజ్యోతి, బచ్చలకూరి జానయ్య, సూర్యనారాయణ,సతీష్‌, వెంకన్న, శ్రీను, రామన్న, సైదులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement