Abn logo
Sep 16 2021 @ 23:44PM

హామీలు విస్మరించిన సీఎం కేసీఆర్‌

తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న అనిరుధ్‌ రెడ్డి, నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌


పాలమూరు, సెప్టెంబరు 16 : సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతిపత్రం అందజే శారు. ముఖ్య అతిథిగా హాజరైన కొత్వాల్‌ మాట్లాడుతూ ఎన్నికలొచ్చిన ప్పుడల్లా పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టా రు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత బంధు కో-ఆర్డినేటర్‌ ఖాజా ఫఖ్రుద్దీన్‌, సీనియర్‌ నాయకులు సత్తూ ర్‌ చంద్రకుమార్‌గౌడ్‌, పీసీసీ కార్యదర్శులు ఎన్‌.పి వెంకటేష్‌, ఎస్‌.వినోద్‌ కుమార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్య క్షురాలు బెక్కరి అనిత, మీడియా కన్వీనర్‌ సి.జె బెనహర్‌, పట్టణ అధ్యక్షు డు లక్ష్మణ్‌ యాదవ్‌, నరసింహారెడ్డి, వెంకటయ్య, జె.చంద్ర శేఖర్‌, సాయి బాబా, జహీర్‌అక్తర్‌, అవేజ్‌, నాగరాజు, ఫయాజ్‌, రాములు యాదవ్‌, మల్లేష్‌, అజ్మత్‌, అబ్దుల్‌హక్‌, ఖాదర్‌, అలీ, అల్తాఫ్‌, సాదిక్‌, పాషా, ఖాజా, వెంకటలక్ష్మి, సుజాత, సహజ, గంగిరెడ్డి పాల్గొన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి


రాజాపూర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంఽధు అమల చేయాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విన తిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ జడ్చర్ల నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌, టీపీ సీసీకార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌.సిద్ధేశ్వర్‌ ఆధ్వర్యంలో దళిత, గిరిజన దండోరా నిర్వహించారు. కార్యక్ర మంలో లింగం, యాదయ్య, శ్రీనివాస్‌ నాయక్‌, గోవర్దన్‌రెడ్డి, కృష్ణయ్య, నసీర్‌ బైగ్‌, రమేష్‌ రెడ్డి, సాయి, నాయకులు పాల్గొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి 


జడ్చర్ల : దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అమలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్‌, జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాలలో అమలు చేయాలంటూ తహసీల్దార్‌ లక్ష్మీనారా యణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిత్యానందం, బుక్కవెంకటేశం, తిరుపతిరెడ్డి, నిఖిల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, ఆరిఫ్‌, ఖాజా, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.