Live Cm kcr: వికారాబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయం.. కలెక్టరేట్ భవన్ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-08-16T22:44:08+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌‌లో టీఆర్ఎస్ కార్యాలయంతో కలెక్టరేట్ (Collectorate) నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాల (Medical College) నిర్మాణానికి...

Live Cm kcr: వికారాబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయం.. కలెక్టరేట్ భవన్ ప్రారంభోత్సవం

వికారాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌‌లో టీఆర్ఎస్ కార్యాలయంతో కలెక్టరేట్ (Collectorate) నూతన భవనాన్ని ప్రారంభించారు. వైద్య కళాశాల (Medical College) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. 


’’రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోయాయని ప్రచారం చేశారు.  తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాగా చేశాం. కర్ణాటక, ఏపీలో కంటే భూముల ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చన్నారు. సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక వాసులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణాలో లాగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కర్ణాటక వాసులు కోరుతున్నారు. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వడం ప్రారంభించాం. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం. ప్రాజెక్టులు ఉన్న చోట పన్ను లేకుండా నీళ్లు ఇస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా పక్కగా అమలవుతున్నాయి. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం.  దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వచ్చిన తెలంగాణను గుంటనక్కల పాలు కాకుండా చూడాలి. సంక్షేమ పథకాలను ఉచితాలని కేంద్రం అంటోంది. వికారాబాద్‌కు మెడికల్, డిగ్రీ కళాశాల మంజూరు చేశాం. తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలు లేవు. దేశంలో పంట పెట్టుబడి తీసుకుంటున్నది తెలంగాణ రైతు మాత్రమేనన్నారు. 

Updated Date - 2022-08-16T22:44:08+05:30 IST