సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-01-29T06:14:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తోట ఆగయ్యతోపాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు
తోట ఆగయ్యను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

- ఆగయ్యను సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సిరిసిల్ల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తోట ఆగయ్యతోపాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన అధ్యక్షుడు ఆగయ్యను సన్మానించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి వేములవాడ రాజరాజేశ్వరస్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.  అనంతరం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం ఆగయ్యను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గులాబీ సేన పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీకోసం మరింత శ్రమించి అనేక విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ముస్తాబాద్‌ రైతు బంధు కో ఆర్డినేటర్‌ గోపాల్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు అందె సుభాష్‌, న్యాలకొండ రాఘవరెడ్డి, కొమిరె సంజీవ్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-29T06:14:02+05:30 IST