Cm Kcr‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉంది: Revanth Reddy

ABN , First Publish Date - 2022-07-11T23:59:28+05:30 IST

సీఎం కేసీఆర్(Cm Kcr)‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని.. నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని...

Cm Kcr‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉంది: Revanth Reddy

హైదరాబాద్: సీఎం కేసీఆర్(Cm Kcr)‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని.. నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని చూశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) ఎద్దేవా చేశారు. వర్షాలపై సోమవారం సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp)పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


‘‘కేసీఆర్ చెప్పింది నిజమే ..మోడీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పే ఉంది. కానీ మోడీకు గురువు కేసీఆర్. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా?. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్‎నాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కదా?.  ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‎ను  టీఆర్ఎస్‎లో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా?. ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్ నాథ్ షిండే‎లను తయారు చేసింది కేసీఆర్ కాదా?. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే భూతం కేసీఆర్‎ను పట్టుకుంది. టీఆర్ఎస్‎లో ఉన్న వారంతా  ఇతర పార్టీ నేతలే. ఏక్ నాథ్ షిండే‎కు కేసీఆర్ గాడ్ ఫాదర్. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు.. కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లిస్తున్నారు. ఈ దేశంలో సాగు ,తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. చైనా కంటే అద్భుతమైన ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్‎తో పోల్చే స్థాయి నరేంద్రమోదీకి లేదు. పార్లమెంట్‎లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా?. బీజేపీ తప్పిదాల్లో టీఆర్ఎస్ పాత్ర ఉంది. మోడీ దోపిడీలో కేసీఆర్ వాటా ఏంతో తేల్చాలి.’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 



Updated Date - 2022-07-11T23:59:28+05:30 IST